కెసిఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి రేగుంట చంద్రశేఖర్, సిపిఐ

Published: Saturday October 08, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కే, చంద్రశేఖర్ రావు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ సిపిఐ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ అన్నారు.
శుక్ర వారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, కాంట్రాక్టు అనే పదేమీ లేకుండా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికున్ని పర్మినెంట్ చేస్తానని, దానికి అనుగుణంగా వారికి జీతభత్యాలు కూడా ఇస్తానని ఇచ్చిన హామీలను ఆయన నిలబెట్టుకోవాలని అన్నారు,
రాష్ట్ర రాజకీయాల్లో నుండి దేశ రాజకీయాల్లోకి  వెళ్తున్నందుకు స్వాగతిస్తూనే, దానితోపాటు సింగరేణి  కార్మికుల, అసంఘటిత కార్మికుల పట్ల ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని  అమలు చేయాలని, ఎలాగైతే సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి చేసిన వాగ్దానాల్ని,  కార్మికులకు సంబంధించిన హక్కుల్ని కాలరాయకుండ  వెంటనే సింగరేణికి ఎన్నికలు నిర్వహించి  కార్మికులకు అండగా ఉండాలని ఆయన అన్నారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల్ని కాలరాస్తూ, విమాన యాన్నాన్ని, రైల్వేలను, ప్రైవేటు పరం చేస్తూ ఆదానీ ,అంబానీలకు, కట్టబెడుతున్నారని, కార్మిక వర్గాన్ని చిన్నా భిన్నం చేస్తూ, ఈ భారత దేశ సంపదను కొంతమందికే దోచిపెట్టే విధంగా జరుగుతోందని, ఈ తరుణంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి, కార్మికులను పోరాటాలకు సమాయత్తం చేయటానికి ఈనెల 9న మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ మహాసభలను స్థానిక సింగరేణి కళావేదికలో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాలవైన శంకర్ రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకట స్వామి చిప్ప నరసయ్య తదితర నాయకులు వస్తున్నారని, ఈ మహాసభలకు జిల్లాలోని కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు, నియోజక వర్గంలోని ప్రజలందరూ, హాజరై జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దాగం మల్లేష్, మిట్టపల్లి వెంకటస్వామి, డిఆర్, శ్రీధర్, తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.