చిల్కానగర్ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా తీర్చిదిద్దుతా : డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శ

Published: Thursday May 20, 2021
మేడిపల్లి, మే19, (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ డివిజన్లోని ఇరిగేషన్ నాల పైన ఉన్న కల్వర్టులను మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొరకై విచ్చేసిన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మరియు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పర్యటించారు. కుమ్మరిగుంటలో 12 లక్షల వ్యయంతో కచ్చానాల పనులను డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా విశాతట్ ఎంక్లేవ్ కల్వర్టు రాఘవేంద్ర నగర్ కాలనీ కల్వర్టు మరియు కావేరి నగర్ కల్వర్ట్ లని పర్యవేక్షించారు, అక్కడ నుంచి ఆదర్శనగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న స్మశాన వాటిక సదుపాయాల గురించి డిప్యూటీ మేయర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు,వెంటనే ఆ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అనంతరం చిలకానగర్ మెయిన్ రోడ్డు పైన ఉన్న సేవరేజ్ లైన్ గురించి స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ కు బోడుప్పల్ నుంచి వచ్చే సీవరేజ్ లైన్లు చిల్కానగర్ లైన్లో కలపడం వలన అది ఓవర్ లోడ్ అయి నిత్యం పొంగుతున్నాయి అని బోడుప్పల్ కార్పొరేషన్ వారికి సపరేట్గా లైన్ లు వేసుకోమని వీరి ద్వారా వారికి చెప్పమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోతె శోభన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, రామ్ రెడ్డి, వి బి నరసింహ, పండ్ల కిషన్,  కొకొండా జగన్, రాజ్ కుమార్, మహమూద్ బింగి శ్రీనివాస్, గారికే సుధాకర్ పుష్ప రాజ్, రామానుజన్, యాదగిరి ప్రవీణ్, ఫరూక్, సాయినాజ్, అనసూయ, బాలు, శ్యామ్, రమేష్, బంటి, బిట్టు, బాబు, మరియు జిహెచ్ఎంసి అధికారులు డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి ఈ ఈ నాగేందర్, డి ఈ నిఖిల్ రెడ్డి, AE రాజ్ కుమార్, డిఈ శానిటేషన్ చందనా చౌహాన్ మరియు కుమ్మరి కుంట బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.