కె.సి.ఆర్, కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం : ఆలయ చైర్మన్ అదిరే నారాయణరావు

Published: Thursday October 07, 2021
వెల్గటూర్, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలములోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి  కోటి లింగాలను పర్యాటక క్షేత్రంగా ప్రకటిస్తూ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో వర్షకాల ముఖ్యమంత్రి .కెసి.ఆర్  కట్టించిన ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడే విధంగా కార్యసిద్ధి  తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఆలయ చైర్మన్ పదిరె నారాయణ రావు ఆధ్వర్యంలో కె.సి.ఆర్, కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చూశారు. ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి, కొప్పుల ఈశ్వర్ గోత్రనామాలతో నాయకులు అర్చన అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్ పి టి సి బి సుధారాణి రామస్వామి, తె.రా.స మండల శాఖ అధ్యక్షులు చెల్లూరి రామచంద్ర గౌడ్, రవితేజ, ఆలయ డైరెక్టర్లు కనపర్తి సుధాకర్ రావు, సత్యనారాయణ, సంకొజు తిరుమల చారి, ఆలయ అర్చకులు నాగరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.