మిషన్ భగీరథ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్లాది వాసుప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్త

Published: Tuesday October 25, 2022

మధిర రూరల్ అక్టోబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీలో మంచిగా ఉన్న రహదారులను మిషన్ భగీరథ పైపులైను వేసే సిబ్బంది ధ్వంసం చేయటం వల్ల ప్రభుత్వంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని కౌన్సిలర్ మల్లాది వాసు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఉన్న పదవ వార్డులో పైప్ లైన్ పేరుతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ధ్వంసం చేయటంపై ఆయన సంబందిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అడ్డగోలుగా సిమెంట్ రోడ్డు ధ్వంసం చేయటం పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా రహదారులను ఎలా ధ్వంసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ పైపులైన్ వేసే సిబ్బంది ఇష్టానుసారంగా  రహదారులు ధ్వంసం చేయటం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అయన తెలిపారు. పట్టణంలో మిషన్  భగీరథ సిబ్బంది ధ్వంసం చేసిన రహదారులను తక్షణమే పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు