ఉద్దేశ పూర్వకంగా చిత్రీకరించిన వీడియోలను అపకపోతే పరువునష్టం దావకేసు వేస్తాం

Published: Tuesday May 25, 2021
జగిత్యాల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మండల్ హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో కోటగిరి నిర్మల భర్త సిద్దిరాములు గ్రామంలో నూతనంగా జీ ప్లస్ 2 భవన నిర్మాణం అనుమతి కోసం సర్పంచ్ మునుగోటి లక్ష్మణ్ రావు 24 వేల రూపాయలు లంచం అడిగారని నిర్మల కుమారుడు కోటగిరి మోహన్ అభియోగం మోపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జీ ప్లస్ 2 భవన నిర్మాణం కోసం ఆన్లైన్ రుసుము కొలతలకు అనుగుణంగా గ్రామపంచాయతీ తీర్మానానికి లోబడి ఇచ్చే రుసుము 24 వేల రూపాయలు చెల్లిస్తే అనుమతిస్తామని సర్పంచ్ చెప్పిన మాటను వక్రీకరించి డబ్బులు లంచంగా ఇవ్వమన్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం కోటగిరి మోహన్ పై తీవ్ర అసమానంతో ఉన్నారు. భవనానికి చెల్లించవలసిన రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించుటకు కార్యదర్శి వెసులుబాటు కల్పించినకూడ  రుసుము చెల్లించకుండ ఐదు రోజులు జాప్యంచేసి గవర్నమెంట్ కు చెల్లించాల్సిన రుసుము చెల్లించక పంచాయతీ కార్యదర్శికి లంచం ఆశ చూపడని ప్రలోభానికి లొంగకపోవడంతో ఆన్లైన్లో అప్లై చేసిన రసీదును ఆధారంగా చేసుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆమోదించిన రుసుము చెల్లించకుండ ఉద్దేశపూర్వకంగా సర్పంచ్ కార్యదర్శి మరియు పాలకవర్గంపై కోటగిరి మోహన్ అభియోగాలు మోపే విధంగా ఉన్నాయని ఉద్దేశ పూర్వకంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో అపకపోతే పరువునష్టం దావ కేసు వేస్తామని పాలకవర్గం హెచ్చరించారు.