రైళ్లలో జర్నలిస్టులకు వందశాతం రాయితి కల్పించండి - ఎంపీ అర్వింద్ ను కోరిన జగిత్యాల జర్నలిస్ట

Published: Thursday August 18, 2022

జగిత్యాల, ఆగస్టు 17 (ప్రజాపాలన ప్రతినిధి): రైళ్లలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు ప్రయాణించే సమయంలో వందశాతం రాయితీ కల్పించాలని ఎంపీ అర్వింద్ ను టియుడబ్లుజే (ఐజేయు) జర్నలిస్టులు కోరారు. బుధవారం విఆర్ఏ లకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ అర్వింద్ ను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, ప్రదీప్ తో కూడిన జర్నలిస్టులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో రైళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అక్రిడేటేడ్ జర్నలిస్టులకు యాభై శాతంతో రైళ్లలో ప్రయాణించే సౌకర్యం ఉండేది అన్నారు. కరోన నేపథ్యంలో రైళ్లు రద్దు కావడంతో ఈ సదుపాయాన్ని రైల్వేశాఖ రద్దు చేసిందని ఇటీవలె తిరిగి పునరుద్ధరించిందన్నారు. అయితే జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైళ్లలో జర్నలిస్టులకు వంద శాతం రాయితీ సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుతం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ అర్వింద్ ను జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఉన్నారు.