వడ్డెరలను బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలోకి చేర్చాలి..

Published: Tuesday November 29, 2022
చౌటుప్పల్ నవంబర్ 28( ప్రజా పాలన ప్రతినిధి ) తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిల మల్లు ఆదేశాల మేరకు 
వడ్డెర కులస్తుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం నందు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డికి సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోదాసు నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వడ్డెర కులస్తులను బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పాలకమండలిని నియమించి వడ్డెర కార్పొరేషన్ కు 1000 కోట్ల నిధులు కేటాయించడంతోపాటు జనవ ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వడ్డెరలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టర్ లకు ప్రభుత్వ పనుల్లో 20 శాతం ఈఎండి లేకుండా పనులు కేటాయించడంతోపాటు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అవకాశం కల్పించాలన్నారు.వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 20 లక్షల రూపాయలు,గాయపడిన వారికి 10 లక్షల రూపాయల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటేశం మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు బోదాసు వెంకన్న,చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు కుంచపు శ్రీనివాస్,నాయకులు గండికోట రామరాజు,ఉప్పు తోట ముత్యాలు,ముద్దంగుల కృష్ణ, పల్లపు వెంకటేష్,దండుగుల యాదగిరి,బోదాసు యాదగిరి, గండికోట కృష్ణ,పల్లపు కృష్ణ, ఆలకుంట్ల శ్రీను,వీరయ్య, బోదాసు శ్రీను,పల్లపు చిన్న వెంకటేష్,పల్లపు శంకరయ్య, పల్లపు మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.