పట్లూరులో కంటి వెలుగు ప్రారంభం

Published: Friday January 20, 2023
* మర్పల్లి మండల ఎంపిపి లలిత రమేష్
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : అంధత్వ వ్యాధులను నివారించడమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామని మర్పల్లి మండల ఎంపిపి లలిత రమేష్ అన్నారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ అంతత్వాన్ని నిర్మూలించి కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పట్లూరు గ్రామంలో అర్హులైన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందన్నారు. పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో ఏర్పాటు చేసిన  రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీ చేయబడునని స్పష్టం చేశారు. కళ్ళను నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా అంధత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ తమ కళ్ళను పరీక్షించుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పి. మధుకర్, ఎంపీపీ మోహన్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ సోహెల్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డాక్టర్ నేహా, ఎంపీటీసీ స్వప్న సురేష్, ఆశ వర్కర్స్, పిహెచ్సి సిబ్బంది, జిపి మెంబర్స్, ప్రజలు పాల్గొన్నారు.