గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ యొక్క లక్ష్యం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్

Published: Tuesday November 22, 2022
బూర్గంపాడు( ప్రజా పాలన.)
 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని నకిరీ పేట గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు, గత ప్రభుత్వాలు అభివృద్ధిని పాటించుకోలేదని అన్నారు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ప్రజా సంక్షేమ గ్రామాల అభివృద్ధి ధ్యేయమే తన లక్ష్యమని అన్నారు, ప్రజా అవసరాలకు అనుగుణంగా తీర్చిన ఏకైక ప్రభుత్వం  బిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు, రాబోయే రోజులలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు అన్ని రంగాలలో ప్రగతి పదంలో తీసుకువెళ్లేందుకు శ్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు, సీసీ రోడ్డు నిర్మాణం బీటీ రోడ్డు నిర్మాణ అంతర్గత రహదారులు నిర్మాణం సంబంధించి మీకు ఎలిపోయినటువంటి అభివృద్ధి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు, సీఎం కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు, ప్రజా సంక్షేమంలో పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.