యువకులకు చేయూత

Published: Thursday March 18, 2021
మంచిర్యాల టౌన్, మార్చి17, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పదవ వార్డ్ లో ని యువతకు వీ నాగరాజు తన సొంత ఖర్చుతో క్రికెట్ కు సంబంధించి న్యూ టార్గెట్ నస్పూర్ టీం టెన్త్ వార్డు పేరుతో ముద్రించిన దుస్తులు టోపీ తదితర క్రీడా సామగ్రిని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాది నస్పూర్ ప్రాంతమే జీవనోపాధి కొరకై హైదరాబాద్ వెళ్లాను హరీ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఒక షాపును నిర్వహించి దేవుని కృప వల్ల సొంత కాళ్లపై నిలబడి నలుగురికి చేయూతను అందిస్తున్నానని కన్న ఊరు పై మమకారంతో నస్పూర్ లోని క్రికెట్ ఆటలో ఆసక్తి ఉండి వనరులు లేని యువతను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నానని  ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.