ఆశా బాధితుల కుటుంభాలను ఆదుకుందాం

Published: Monday April 26, 2021
సాఫ్ట్ వేర్ జనాఫాక్ట్ కంపెనీ ఉద్యోగి నీలం శ్రీనివాసరావుఆశా బాధితుల సౌకర్యార్థం కుర్చీల వితరణ
మధిర, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : సాయంత్రం మధిర పట్నం లొ గత 25 సంవత్సరాలనుండి  Hiv /ఎయిడ్స్ బాధితుల కు సేవా సహాయ కార్యక్రమం లు చేపడుతున్న అజాద్ రోడ్డు లొ నివాసం ఉంటున్న ప్రముఖ సామాజిక సేవకుడు (ఆరోగ్య పరివేక్ష కుడు) ఆశ మిత్ర లంకా కొండయ్య నిస్వార్థంగాచేపడుతున్న ఆశ బాధితుల పునరావాస  సహాయ కేంద్రానికి మడుపల్లి నివాసి మానవతా వాది శ్రీ నీలం కృష్ణ మూర్తి గారి కుమారుడు హైద్రాబాద్ జనాఫాక్ట్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన శ్రీ నీలం శ్రీనివాస్ రావు ఆర్ధిక వితరణ తో ఆశ బాధితుల కుటుంబాలు సౌకర్యార్ధం 20 నీల్ కమల్ కుర్చీలు వితరణ గా కొండయ్య కుటుంబంనకు అందచేసినారు. ఈ సందర్బంగా నీలం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సమాజo లో ఎంతో మంది తెలిసి తెలియక తప్పు లు చేసి Hiv/ఎయిడ్స్ బారిన పడి కుటుంబాలు చెల్లా చెదరై ఆదరణ కూ నోచుకోక దయనీ యా పరిస్థితి లొ ఉన్న వారిని  చేర దీసి  నేనున్న మీకు ఏమి కాదని కొండంత భరోసాతో సేవా చేస్తూన్న లంకా కొండయ్య సేవలు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలుసు కొని వారి సేవలో చంద్రునికో నూలు పోగు లాగా ఈ చిన్న సహాయo చేయాలని పించింది అని శ్రీనివాసరావు తెలిపినారు. అదేవిదంగా సామాజిక సేవకుడు లంకా కొండయ్య మాట్లాడుతూ గతజనతాకర్ ఫ్యూ మొదలుకొని ఇప్పుటి వరకు అనేక మంది దాతలు చేత ఆశ బాధితుల కూ టీబీ పేషెంట్ లకువికలాంగులకు వితంతు వు లకు వృద్దులుకు అజాద్ రోడ్డు లొ చెట్ల నీడన నిల బెట్టి మరియు టెంట్ కుర్చీలు అద్దె కూ తెప్పించి సేవా సహాయ కార్యక్రమం చేస్తూన్న విషయం  మిత్రులు నీలం శ్రీనివాస్ రావు గమనించి  మానవత దృక్పదoతో దయాహృదయoతో స్పందించి కుర్చీలు వితరణ చేయటం నాయెక్క హృదయపూర్వక అభినందనలు తెలియపరస్తున్నా నని కొండయ్య తెలిపినారు. ఈ కార్యక్రమంలొ లంకా సేవా ఫాండేషన్ వాలంటీర్లు ఆదిమూలం వెంకటేష్, లంకా  కరుణ, లియోనా, శ్యామ్ కుమార్, గోపి, సాయి, అంజి తదితరులు పాల్గొన్నారు.