ప్రజా సమస్యల పరిష్కారాని కి నిరంతర విప్లవ ప్రజా ఉద్యమాలు. ... సిపిఐ( యంఎల్) రెడ్ స్టార్ పార్టీ క

Published: Monday June 27, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్ 26, ప్రజాపాలన:
 
 దేశంలో 18రాష్టాల్లో స్థిరంగా ఉన్న పార్టీ 
ప్రజా సమస్యల పరిష్కారాని కి నిరంతర విప్లవ ప్రజా ఉద్యమాలు చేస్తున్నట్లు సిపిఐ( యంఎల్) రెడ్ స్టార్ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కామ్రేడ్ సౌర యాదవ్  అన్నారు. ఆదివారం 
శ్రీరాంపూర్ సాందీపని ఫంక్షన్ హాల్ (అమరవీరుల నగర్) లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు- లెనినిస్టు) రెడ్ స్టార్  మంచిర్యాల జిల్లా 2వ మహాసభ ను నిర్వహించారు. ఈ యొక్క మహాసభకు ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాడి దేవరాజు  సభ అధ్యక్షత వహించగా పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ మొలుగూరి సైదయ్య ,   కామ్రేడ్ మన్నవ హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలు,కామ్రేడ్ తాటికొండ రమాదేవి ,  కామ్రేడ్ గూడూరి వైకుంఠం లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించు కొనుటకు గాను 2022 సెప్టెంబర్ 24 నుండి 29 వరకు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో  వివిధ రాష్ట్రాల్లో జిల్లా,  డివిజన్,  మండల , పట్టణ మహాసభలు నిర్వహించాలన్న  కేంద్ర కమిటీ పిలుపు మేరకు  ఆగస్టు 7, 8 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే 3వ మహాసభను మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
* స్వాతంత్ర్య , తెలంగాణ సాయుధ పోరాటంలో...
 
1920 లో ఏర్పడిన ఉమ్మడి భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యో ద్యమంలో సంపూర్ణ   స్వాతంత్ర్యం నినాదాన్ని ఎజెండా మీదకు తీసుకువచ్చి,  దేశం లో కార్మిక, కర్షక రాజ్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టారని తెలిపారు. 1944 నుండి 1951 వరకు సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దున్నే వాడిదే భూమి నినాదాన్ని ముందుకు తెచ్చింది.నైజాం పాలకులు,పటేల్లు, పట్వారీలు, గ్రామీణ ప్రజానీకంపై మొత్తం తెలంగాణ ప్రజానీకం పై చేస్తున్న దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాటం జరిపారు. నైజాం సైన్యాన్ని తరిమికొట్టారు. మూడువేల గ్రామాలలో ఎర్రజెండా రాజ్యాన్ని స్థాపించి , 10 లక్షల ఎకరాల భూమిని పంచినట్లు గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మొదలగు అమరవీరుల పోరాట పటిమతో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటానికి కులాలకు, మతాలకు అతీతంగా పేద ప్రజలు సమైక్యంగా ఉద్యమించి భూస్వాములను తరిమికొట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ నాయకురాలు కామ్రేడ్ తాటికొండ రమాదేవి  మాట్లాడుతూ నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల వారసత్వం లో నయా రివిజనిజం నుండి కమ్యూనిస్టు విప్లవకారుల విడగొట్టు కొని 1969 ఏప్రిల్ 22న లెనిన్ పుట్టినరోజున కామ్రేడ్ చారుమజుందార్ నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) కమ్యూనిస్టు విప్లవకారులు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.
 
* ఏకగ్రీవంగా పలు తీర్మానాలు  ఆమోదం చేశారు. అందులో ప్రధానమైనవి
 
 
 :-  కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ  ప్రభుత్వం లోని బిజెపి-ఆర్ ఎస్ ఎస్ లు 
రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు.ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూంది.
:- చమురు ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుంది
ప్రజా సమస్యలపై నిలదీస్తున్న అనేకమంది ఉద్యమకారుల నోరు నొక్కే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
:- నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చెందవలసిన మౌలిక సదుపాయాలు ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించివ్వాలి. గ్రామాలలో ఉన్న నిరుపేదలకు మూడెకరాల భూమి,  పోడు భూముల సమస్య పరిష్కరించాలి.
 
:-  నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. ఓపెన్ కాస్ట్ రద్దుచేసి అండర్ గ్రౌండ్ మైన్ ఏర్పాటు చేయాలి.
:- ,కొత్త రేషన్ కార్డు ఇచ్చి బియ్యం తో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలి.  మద్యం నిషేధిం అమలుచేయాలి. 
 
ఈ సమావేశంలో  నాయకులు, కామ్రేడ్ గోగర్ల తిరుపతి , , కామ్రేడ్ చింతపురి బాపురావ్ ,  కామ్రేడ్ బండారి ఆనంద్,  కామ్రేడ్ మాచర్ల సదానందం , కామ్రేడ్ బింగి సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.