ఎన్.ఎస్.వి విద్యార్థులకు కార్పొరేట్ కోలువులు

Published: Monday July 19, 2021
జగిత్యాల, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల స్థానిక ఎన్.ఎస్.వి డిగ్రీ కళాశాలలో బీ.ఎస్సి తృతీయ సంవత్సరం  చదువుతున్న విద్యార్థులు సకినాల నీలిమ ముగల భార్గవి గుగ్గిళ్ల నందినిలు బహుళ జాతీయ సాఫ్ట్వేర్ రంగ సంస్థలు టిసిఎస్ విప్రో ఇన్ఫోసిస్ లలో ఒకేసారి మూడు ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీలలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల విద్యసంస్థలు అధినేత స్వర్గీయ నవీన్ రెడ్డి ఆశయ సాధనలో తన ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక  టాస్క్ శిక్షణ అర్థమెటిక్ రీజనింగ్ లాంటి ప్రత్యేక శిక్షణను అందించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగాలు సాధించరని జగిత్యాల ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ విద్యార్థులకు పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నవీన్ రెడ్డి స్థాపించిన విద్యాసంస్థలు ఎప్పటికీ ఇలాగానే కోనసాగాలని భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సాధిస్తూ నాణ్యమైన విద్యను అందించాలని అధ్యాపక బృందం ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులను ఉన్నత విద్య వైపు ఉద్యోగ సాధనకు కృషి చేయాలని జిల్లాకు మంచిపేరు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్ గోపు మునిందర్ రెడ్డి డిగ్రీ కళాశాల డైరెక్టర్ కడారి మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ చిటికెల శ్రీనివాస్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుండా శ్రీనివాస్ వడ్డేపల్లి మహేందర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శంకరయ్య అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.