వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీకమాస అన్నదాన కార్యక్రమాలు

Published: Tuesday November 08, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 07, ప్రజాపాలన:  కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని ఐబి చౌరస్తాలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అక్టోబర్ నెల 26వ తేదీన మొదలైన ఈ అన్నదాన కార్యక్రమాలు ఈనెల 22వ తేదీ వరకు ప్రతిరోజు నిరాటంకంగా కొనసాగుతూ 13వ రోజు ఘనంగా పూర్తి చేశారు. సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతగా తాటిపల్లి వీరాంజనేయ ప్రసాద్ వ్యవహరించగా కార్యక్రమానికి అతిథిగా 34వ వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదానం తో పాటు మంచిర్యాలలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు ప్రతిరోజు భోజనం అందజేస్తు పక్షవాతం కారణంగా నిరాశ్రయులైన పాత రాములు అనే నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్,   తదితరులు పాల్గొన్నారు.