జగిత్యాలకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ ఎం.ఎఫ్.ఎస్ బస్సు యాత్ర

Published: Monday March 28, 2022

జగిత్యాల, మార్చి 27 (ప్రజాపాలన ప్రతినిధి): ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేపట్టిన బస్సు యాత్ర   ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాదిగ ఆధ్వర్యంలో స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసిన అనంతరం ఎస్సి హాస్టల్ విధ్యార్ధులతో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి సదస్సులో ఎంఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బస్సు యాత్ర సమన్వయ కర్త గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ బద్దంగా ఎన్నికై స్వపరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్ రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే కుట్రలో భాగంగా సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం మర్చిపోయారని నరేష్ మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ పాలన చిరకాలం కొనసాగాలనే కుట్రబుద్ధిలో భాగంగా రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంటున్నాడని విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 9న హైదరాబాద్ లో జరిగే యుద్ధభేరి మహాసభకు పెద్ద ఎత్తున బహుజన వర్గాల ప్రజలను తరలించాలని ఎమ్మార్పీఎస్ నాయకులకు సూచించారు. ఈ బస్సు యాత్రలో జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ బోనగిరి కిషన్ మాదిగ బెజ్జంకి అనిల్ మాదిగ ఆరెల్లి మల్లేష్ మాదిగ బాలు యాదవ్ నవీన్ మధు ప్రశాంత్ రాజేష్ వంశీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.