ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు.

Published: Friday December 09, 2022
అభివృద్ధి పథకాల అమలుతోనే ఆకర్షితులై బిఆర్ఎస్  పార్టీలో భారీ చేరికలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్ నందు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &, పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  సమక్షంలో వివిధ పార్టీల నుంచి సుమారు 500 కుటుంబాలు సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఆహ్వానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతున్నదని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదన్నారు., దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుంది అని అన్నారు, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు, గత పాలకుల నిర్లక్ష్యం వైఖరి వల్లే గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు, బిఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మారుమూల గ్రామాలకు రోడ్ల సహకారంతోపాటు అంతర్గత రహదారులను మెరుగుపరచడం జరుగుతున్నది అన్నారు, రైతులకు నిరంతరం కరెంటు సరఫరా చేస్తూ వారికి కరెంటు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు., రైతు స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు ప్రజలు సైతం పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సాధించాలన్నారు, వివేకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకురావాలని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు., అందరి సహకారంతో పినపాక నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు.