సమీక్ష సమావేశానికి స్పందించిన సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం

Published: Friday April 30, 2021

బెల్లంపల్లి, మార్చి 29, ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలసి గురువారం  సందర్శించారు.  డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ అత్యవసర సిబ్బందిని వెంటనే సమకూర్చుకోవాలని మందులు వైద్య పరికరాలు కూడా తెప్పించుకోవాలని ఆయన స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, కరోనా బాధితులు అధికంగాచేరికైతే పడకల సంఖ్యను కూడా పెంచుకోవల్సిందిగా ఆయన సూచించారు. మిగతా సీటి స్కాన్ వంటి పరికరాలను సమకూర్చే విషయం పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం వెంటనే స్పందించి సూచనలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డైరెక్టర్ బలరాంకు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఐసోలేషన్ కేంద్రంలో పని చేయడానికి ఆసక్తి కలిగినవారు తనను ఈ నెంబర్ ద్వారా 9866242008 సంప్రదించవలసినదిగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బలరాం, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి,  ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి శౌరీ, ప్రభుత్వ వైద్యాధికారి అనిల్, బెల్లంపల్లి ఏసీపి ఎం ఎ రహామాన్, స్థానిక సి ఐ లు, ఎస్ ఐ లు, ఏరియా హాస్పిటల్ ఫిట్ సెక్రెటరీ అనుముల సత్యనారాయణ, చెవిటి సుదర్శన్ పలువురు ప్రజాప్రతి నిధులు టిఆర్ఎస్ నాయకులు, హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.