దేశాన్ని రక్షించుకుందాం.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం,

Published: Wednesday March 23, 2022
దేశవ్యాప్త సమ్మె పోస్టర్  ఆవిష్కరించిన
సి ఐ టి యు అనుబంధ సంఘాల నాయకులు,
బెల్లంపల్లి మార్చి 22 ప్రజా పాలన ప్రతినిధి: ఈనెల 28. 29 తేదీలలో చేయతలపెట్టిన దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో పాల్గొనడానికి సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటున్నామని సమ్మె పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, బెల్లంపల్లి సి ఐ టి యు అనుబంధ సంఘాల నాయకులు. మంగళవారం నాడు బెల్లంపల్లిలో పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ, నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకు వచ్చి, కార్మికులను బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తుందని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పర్మనెంట్, చేయకపోగా కనీస వేతనాలను అమలు చేయడం లేదని, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ధరలను పెంచి పేదలపై మరింత భారాన్ని మోపుగుతుందని, ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని అన్నారు. మార్చి 28, 29న జరుగుదేశవ్యాప్త సమ్మెను కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు, రెండు రోజుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అబ్బో జు రమణ. సిపిఎం పార్టీ. జిల్లా కమిటీ సభ్యుడు  గూమస అశోక్, డివైఎఫ్ఐ. జిల్లా నాయకులు చల్లూరి దేవదాస్. జాడి శేఖర్. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్. సీఐటీయూ. జిల్లా అధ్యక్షుడు. ఎస్.కె.యాకుబ్. కార్యదర్శి గొడిసెల చంద్రమొగిలి. పట్టణ కార్యదర్శి. పర్ల పెళ్లి సుమన్. మున్సిపల్ సంఘం నాయకులు. ఈర్ల రాజ మొగిలి. బోళ్ల లక్ష్మీనారాయణ. తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్. సీఐటీయూ. యూనియన్. జిల్లా అధ్యక్షురాలు. భానుమతి. మంగ వతి. వినోద. మహేశ్వరి. సరిత. మరియు అంగన్వాడి నాయకురాల్లు. తదితరులు పాల్గొన్నారు.