ఎన్ఎస్ వి విద్యాసంస్థలకు అభినందనలు తెలిపిన ఎంపి ధర్మపురి అరవింద్

Published: Wednesday November 24, 2021

జగిత్యాల, నవంబర్, 23 ( ప్రజాపాలన ప్రతినిధి): స్థానిక ఎన్ఎస్ వి మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన బిఎస్ సి తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన టిసిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో నికిత మరియు అఖిల లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సాధించారు. ఎంపి ధర్మపురి అరవింద్ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి ఉద్యోగ సాధనకు కృషిచేసిన అధ్యాపకులను మరియు విద్యార్థులతో పాటు ఎన్ఎస్  విద్యాసంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ వి మునిందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల లాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించే విధంగా క్యాంపస్ టు కార్పొరేట్ అనే నినాదాన్ని తీసుకొని ప్రతిరోజు డిగ్రీ సిలబస్ తో పాటుగా ఉద్యోగ సాధనకు తోడ్పడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు అర్థమెటిక్ రీజనింగ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ తో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అందించే ప్రతి ప్రత్యేక నైపుణ్య శిక్షణ శిబిరాలను కళాశాలలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుండా శ్రీనివాస్, వడ్డేపల్లి మహేందర్, ఏవో శంకరయ్య మరియు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.