జాబితా అభ్యంతరాలపై ఫిర్యాదుల స్వీకరణ

Published: Thursday October 28, 2021
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 27, ప్రజాపాలన : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో వైద్యాధికారుల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ https://mancherial.telangana.gov.in నందు పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ నోటీసు బోర్డుపై ఉంచడం జరిగిందని, అభ్యర్థులకు ఇట్టి జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 29 నుండి 30వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోపు కార్యాలయ పని దినములలో వ్రాతపూర్వకంగా తగిన ధృవపత్రాలు జత చేసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.