కల్హేర్ మండలంలో సిమెంట్ రోడ్ల పనులకు భూమి పూజ చేసిన భూపాల్ రెడ్డి

Published: Wednesday February 09, 2022
హైదరాబాద్ 8 ఫిబ్రవరి ప్రజాపాలన: కల్హేర్ మండలంలో సిమెంట్ రోడ్ల పనులకు భూమి పూజ చేసిన భూపాల్ రెడ్డి శాసనసభ్యులు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నేటి కల్హేర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిమెంట్ రోడ్ల పనులకు మంగళవారం నాడు నారాయణ్ ఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ఖానాపూర్-కె, జంల తండా, బిబిపెట్, ఫతేపూర్, ఇంద్రానగర్, పొమ్యా నాయక్ తండా తదితర గ్రామాల్లో భూమి పూజ చేయడం జరిగింది. తదుపరి కల్హేర్ మండలానికి చెందిన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సంబంధిత గ్రామాల సర్పంచులు, జిల్లా ప్రాయోజిత సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.