"సా...గుతున్న నాలా పనులు"

Published: Tuesday June 08, 2021
తార్నాక, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి మురికి కాలువ నాలా పనులు సంవత్సరం నుండి నడుస్తూనే ఉన్నది. తార్నాక రోడ్ నెంబర్-2 కీమత్ నగర్ కాలని, సామ్ సంగ్ సర్వీస్ సెంటర్ రోడ్డు లోని మురుగు నీరు నాలాను హైదరాబాద్ గ్రేటర్ మున్సిపిలిటీ ప్రతి సంవత్సరం తాత్కాలిక మరమతులు చేసి చేతులు దులుపుకునేది. శాశ్వత ప్రాతిపదికన సిమెంటు స్లాబుతో పనులను గత సంవత్సరం ప్రారంబించారు. నాలా నిర్మాణ పనులను పార్షికంగా చేసి గాలికి వదిలేసినారు. మిగత కాలువను త్రవ్వి వదిలేశారు. నిత్యం రద్దీగా ఉండే దారి విజయ్ డైరీ, కెపాల్ కట్ల దవాఖాన, మార్కెట్కు వెల్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం ఆరంభమైనదీ ఇక నాలా రోడ్డుపైన నదిలా పారేరోజు వచ్చింది. నగరంలో మరో నాలా దుర్ఘటన జరిగేవరకు అధికారులు పట్టించుకోరా! అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మిగిలిపోయిన నాలా పనులను కాంట్రాక్టరు ద్వారా వెంటనే పూర్తిచేయించ వలసినదిగా కాలనీ ప్రజలు కోరుతున్నారు