కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ రమ్య సతీష్ గౌడ్

Published: Tuesday February 07, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 6 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత  కంటి వెలుగు కార్యక్రమాన్ని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ
డివిజన్ శ్రీరామ ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్ స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పాల్గొని కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లతో కలిసి
ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరం నిరుపేద ప్రజానీకానికి, ముఖ్యంగా వృద్ధులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ సదఅవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కంటి చూపును పరీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కంటి వెలుగు శిబిరాలలో ప్రాథమికంగా కంటి చూపు పరీక్షలు, అదేవిధంగా అవసరమైతే కంటి అద్దాలు, మెడిసిన్స్, అవసరం ఉన్న వారికి కంటి ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,పలు కాలనీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,పలు పార్టీలనాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.