శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని శ్రీశ్రీ జగద్గురువు సేవాలాల్ మహారాజ్ 16వ వార్షికోత్సవం

Published: Thursday February 02, 2023
* శివారెడ్డి పెట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ నేనావత్ కిషన్ నాయక్
వికారాబాద్ బ్యూరో 1 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాలో శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని శ్రీ శ్రీ జగద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ 16వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని శివారెడ్డి పెట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. బుధవారం ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాలో శ్రీ శ్రీ తపస్వి బాల బ్రహ్మచారి జగద్గురు రామ్ రామ్ మహారాజ్ వారి ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని శ్రీ శ్రీ జగద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శుభ కృత్ నామ సంవత్సర మాఘమాస శుద్ధ ఏకాదశి బుధవారం 1 ఫిబ్రవరి నుండి ఘనంగా ఆలయ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన గణపతి పూజ పుణ్యహవాచనము యజ్ఞ ప్రతిష్ట నవగ్రహ ఆరాధన రుత్విక్ వరణం రుద్రాభిషేకం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమాల పరంపర కొనసాగిందన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన గురువారం రోజు శ్రీ దుర్గా హవనం నవగ్రహ హవనం అష్టదిక్పాలక హోమం శ్రీ శ్రీ వెంకట దాసుల వారి ఆధ్వర్యంలో గీతా యజ్ఞం తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు ఫిబ్రవరి మూడవ తేదీ శుక్రవారం అమ్మవారికి పంచామృతాభిషేకం విశేష పంచామృతాభిషేకం విశేష అభివృద్ధి సహస్ర కలశాభిషేకం అలంకరణ స్వస్తివచనము పల్లకి సేవ ఫిబ్రవరి 4వ తేదీ శనివారం చతుర్దశి విశేష అలంకరణ సేవ ఆశీర్వచనం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తీర్థప్రసాదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుణ్య దంపతులు నేనావత్ కిషన్ నాయక్ జమునాబాయి సుగుణబాయి. నేనావత్ రవీందర్ నాయక్ అంబికా ధరమ్ రాజ్ నాయక్. నేనావత్ పరశురాం నాయక్ హారతి భాయ్ అర్చన దయానంద్ నాయక్ ఆయుషి బాయి.  రాంజీ నాయక్ రోజా బాయ్ అవంతిక బాయి మహేశ్వరి బాయి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.