ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 131 వ వర్దంతి

Published: Monday November 29, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్28, ప్రజాపాలన : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని చార్వాక హాస్పటల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జనం నీరాజనాలు అందుకున్న జ్యోతిరావు పూలే భారత ప్రథమ సామాజిక  తత్వవేత్త, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు ఆయన పోరాట స్పూర్తి ప్రదాత అని కొనియాడారు. 1827 సంవత్సరంలో ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే. సదాశివ బిలాల్ గోవింద్ అనే బ్రాహ్మణ మిత్ర పరిచయం, సాన్నిహిత్యం, థామస్ రచన మానవహక్కుల ప్రభావం, ఆయనపై ఎంతగానో ప్రభావం చూపిందని పేర్కొన్నారు.. కులం, వర్గం, ప్రాంతం, లింగం కారణమని భావించి, తన భార్య సావిత్రి ని బడికి పంపడు ఆయన. దేశంలోనే మొట్ట మొదటిగా వితంతువులకు, అనాధ శిష్యులకు, మహిళలకు, శ్రామిక ప్రజల కోసం రాత్రి బడిని స్థాపించారని గుర్తుచేసు కున్నారు. ఎక్కడ అన్యాయం, వివక్షత చోటుచేసుకుంటే అక్కడ పోరాటం నడిపారని. అనగారిన వర్గాల కాదు, బాధితులైన అగ్రకుల వితంతు పునర్వివాహ లకు విశేషకృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొజ్జ బిక్షమయ్య, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కనికరపు అశోకు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీడిపల్లి రాజ్ కుమార్, మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, మత్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోడంకి చందు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అశోక్, ప్రకాష్, దేవదాస్, రాజన్న, అంజన్న, గోవర్ధన్, రాజు, బాపన్న, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.