తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభానికి ఇబ్రహీంపట్నం నుండి తరలిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : హుజురాబాద్ దళిత బంధు ప్రారంభం సభకు సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్ళిన తెరాస పార్టీ శ్రేణులు, దళిత నాయకులు. దళిత బంధు సంక్షేమ పథకమే కాదు దళితుల జీవితాల్లో బృహత్తర మార్పులకు శ్రీకారం చుట్టే ఒక మహత్తర ఉద్యమం. దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న సందర్భంగా అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించాలని, దళిత బహుజనులు, తెరాస శ్రేణులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో సభకు తరలి వెళ్తున్నామని ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  తెలిపారు. గతంలో రైతు బంధు పథకం ఏ విధంగా ప్రవేశపెట్టారో ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి దళితుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకాన్ని నేడు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి- ఇందిరానగర్‌ వేదికగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న భారీ బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, యాచారం జడ్పిటిసి చిన్నవాళ్ళ జంగమ్మ యాదయ్య డిసిసిబి వైస్ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, కర్నాటి రమేష్ గౌడ్, చీరాల రమేష్, పూజారి చక్రవర్తి గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్మన్ చేవెళ్ల స్వప్న చిరంజీవి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీటీసీలు మండల అధ్యక్షుడు భరత్ రెడ్డి, కౌన్సిలర్ సుల్తాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంబాల పెళ్లి భరత్ కుమార్, మంకాల దాస్, చెరుకూరి రవీందర్, బద్రీనాథ్ గుప్తా, జర్కొని రాజు, కళ్యాణ్ నాయక్, టిఆర్ఎస్వి జిల్లా నాయకులు నెట్టు జగదీశ్వర్, నిమ్మల ప్రసాద్ గౌడ్, ఆనంద్ గౌడ్, ఎండి డి జానీ భాష, ప్రవీణ్ నాయక్, శేఖర్ గౌడ్, రవీందర్, రమేష్, జానీ, శివ, వివిధ గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు.