ఆత్మ బలిదాన్ దివాస్ వేడుకలు

Published: Thursday June 24, 2021
బాలపూర్, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : అఖండ భారతలో జమ్ము కాశ్మీర్ లోని 370 ఆర్టికల్ రద్దు చేసి భారతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీని అందెల శ్రీరాములు అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ నేతలు ఆత్మ బలిదాన్ దివాస్ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యఅతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల హాజరై, నేతలతో కలిసి బలిదాన దివస్ అయినటువంటి శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒకే రాజ్యాంగం - ఒకటే జెండా అమలు.... జమ్ము కాశ్మీర్ లోని 370 ఆర్టికల్ రద్దుకు స్ఫూర్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీనే, ఆత్మబలిదాన్ దీవాస్ సందర్భంగా నాదర్ గుల్ లో మొక్కలు నాటిన అందెల శ్రీరాములు యాదవ్. దేశ సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోడీ... డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అడుగు జాడల్లో నడుస్తున్నారని గుర్తుచేశారు. ఆత్మబలిదాన్ దీవాస్ సందర్భంగా అనంతరం ప్రెస్ కాలనీలో ఓపెన్ జిమ్ లో మొక్కలు నాటి, ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.... అఖండ భారత్ లో జమ్మూకశ్మీర్... భారత్ లో అంతర్భాగమని నినాదించారని కొనియాడారు. ఏక్ దేశ్ మే... దో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చెలేగా... అనే నినాదం వినిపించారని ఆయన గుర్తుచేశారు. ఆ మహానీయుడి స్ఫూర్తితోనే జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి భారతీయ జెండాను ఎగరేశారని చెప్పారు శ్రీరాములు యాదవ్. ముస్లిం మహిళలకు ఇబ్బందిగా మారిన ట్రిఫుల్ తలాక్ రద్దు చేసి అందరికీ ఒకే రాజ్యాంగం అమలు అయ్యేలా ప్రధాని మోడీ చేశారని తెలిపారు. ఏళ్ల తరబడి దేశాన్ని పట్టి పీడించిన ఆర్టికల్స్ ను రద్దు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 273 బూత్ అధ్యక్షులు కొంతం సతీష్ రెడ్డి, కార్పొరేటర్లు నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేనా, తోట శ్రీధర్ రెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, అనిత్ గౌడ్, రవికాంత్ గౌడ్, జగన్ ముదిరాజ్, నెమలి మధు యాదవ్, బాలకృష్ణ, శ్రీనివాస్ సహా కాలనీ వాసులు, అధ్యక్షులు పాల్గొన్నారు.