రైతుల భూముల రికార్డులు ధరణి పోర్టలో సరి చేసుకోవటానికి ఈ సేవల ద్వారా ప్రభుత్వం విపరీతంగా వసూ

Published: Saturday May 21, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 20 ప్రజాపాలన ప్రతినిధి.వైయస్సార్ తెలంగాణ పార్టీ
రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*

మంచాల మండలం కేంద్రంలో మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డ్ కార్యక్రమంలో రైతుల భూమి వివరాలు చాలా వరకు రికార్డ్ లు తారుమారు కావటం రైతుల భూములు ఎకరాల కొద్ది ఆన్ లైన్లో నుండి తొలగించటం జరిగింది ఈ విషయం పై రైతులనుండి అఖిల పక్షం నేతల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపై వ్యతిరేకంగా పోరాటాలు చేయటంతో ప్రభుత్వం స్పందించి ఏడాది క్రితం భూములు రికార్డులు సారి చేసుకోవటానికి రైతులు 100రూపాయలు చెల్లించి ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చాలా మంది రైతులు ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు అయిన ఇప్పట్టి వరకు ఏ ఒక్క రైతు రికార్డ్ సమస్య పరిష్కారం కాలేదు ఈ విషయం పై రైతుల నుండి వివిధ రాజకీయ పార్టీల నుండి ప్రభుత్వం పై ఒత్తిడి పెరగటంతో ప్రభుత్వం మళ్ళీ స్పందించి ప్రభుత్వం ఖజానా నింపుకోవటానికి ఈ సేవ కేంద్రంలో రైతులు చెల్లించే దరఖాస్తు చార్జీ ఏడాది క్రితం 100రూపాయలు ఉన్న చార్జీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవటానికి 1011 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రైతులు వెయ్యి రూపాయలు చెల్లించాలి అంటే నిరు పేద రైతులు నాన ఆందోళన చెందుతున్నారు గతంలో వంద రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకుంటే ఇప్పట్టి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు 1011 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని ప్రభుత్వం పై నమ్మకం లేదుఅని రైతులు అంటున్నారు ఇప్పట్టికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విపరీతంగా పెంచిన ఈ సేవలో రైతులు దరఖాస్తు చేసుకునే చార్జీలు తగ్గించాలి రైతులు దరఖాస్తు చేసుకున్న ప్రతి సమస్య పరిష్కారం చేసి భూ రికార్డ్ లు పూర్తి స్థాయిలో ధరణి పోర్టలో నమోదు చేసేలా ప్రభుత్వ చర్యలు చేపట్టి ధరణి పోర్టల్ ఆన్ లైన్ పనులు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులతో కలిసివైయస్సార్ తెలంగాణ పార్టీ తరుపున ఉద్యమం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో
సపవట్. రామారావు నాయక్
ఎస్టీ సెల్ మండలం నాయకుడు
సపవట్. పాండు. నాయక్
జాటో తు. బాలు నాయక్
పాండు
రైతులు తదితరులు పాల్గొన్నారు