ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం పై బిఎల్ఓ లకు శిక్షణ శిక్షణ తరగతులను నిర్వహించిన ఆర్డిఓ రవీంద్

Published: Wednesday September 07, 2022

బోనకల్, సెప్టెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి:ఓటరుకు ఆధార్ అనుసంధానం పై వి ఎల్ ఓ లకు మంగళవారం బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఖమ్మం ఆర్డీవో మల్లెల వెంకట రవీంద్రనాథ్ ఈ శిక్షణా తరగతులను నిర్వహించారు. టీవీ ద్వారా శిక్షణా తరగతులపై బిఎల్ఓ లకు అవగాహన కల్పించారు. ప్రతి ఓటుకు తప్పనిసరిగా ఆధార్ తో అనుసంధానం చేయాలని బి ఎల్ ఓ లకు సూచించారు. ఓటుకు ఆధార్ ను ఎలా అనుసంధానం చేయాలో దృశ్య శ్రావణ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బిఎల్వోలు, తమ తమ గ్రామాల పరిధిలో తప్పనిసరిగా ఓటుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనిద్వారా దొంగ ఓట్లను అరికట్టడమే కాక ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం అమలు జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రావూరి రాధిక, నాయబ్ తాసిల్దార్ సంగు శ్వేత గిర్దావర్లు గుగులోతు లక్ష్మణ్, జి సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శులు, బిఎల్వోలుగా ఉన్న అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.