వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొరకు అవగాహన సదస్సు

Published: Thursday October 28, 2021
బోనకల్, అక్టోబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఈఓ కే చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లోని వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగాలని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు మరియు గ్రామాల ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్, మండల తాసిల్దార్, మండలంలోని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్స్, అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.