అన్యాక్రాంతం అవుతున్న చెరువు శిఖం , గుడి మాన్యం భూమి ని కాపాడాలి. ...పొన్కల్ గ్రామాస్తులు ర్యా

Published: Thursday June 30, 2022
జన్నారం రూరల్, జున్ 29, ప్రజాపాలన: 
 
 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో పొన్కల్ గ్రామానికి చెందిన  ఊర్ర చెరువు  శిఖం భూమి, వెంకటేశ్వర స్వామి దేవాలయం గుడి మాన్యం భూమి ని కబ్జాదారుల నుంచి కాపాడాలని పొన్కల్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు  స్థానిక ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. తాహాసీల్దాద్ ఇట్యాల కిషన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాస్తులు మాట్లాడుతూ
పోన్కల్ ఊర చెరువు 400 సర్వే నెంబరులో చెరువు శిఖం 41.16 ఎకరాలు ఉందని అట్టి భూమి లో అక్రమంగా ఒక సంఘ భవన నిర్మాణo కోసం అని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీనిని గమనించిన స్థానికులు వారిని తరిమేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మాన్యం భూముల ను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ సంఘ భవనం కోసం వారికి కేటాయించుకున్న స్థలం సర్వేనెంబర్ 5 లో ఉందని , అ సంఘం సభ్యులు పోన్కల్ ఊర చెరువు సర్వే నెంబర్ (400) శిఖం (41, 16) భూమిలోకి మళ్లీ వస్తే తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, రైతులు, మత్య్సకారులు, తదితరులు పాల్గొన్నారు.