బయట పడుతున్న భాదధ్యతారహిత్యం

Published: Friday April 16, 2021

వాంకిడి వరకు ఏరియా ఆసుపత్రి అంబులెన్స్
మహారాష్ట్రలోని కోవిడ్ రోగికి రామకృష్ణాపూర్ ఆసుషత్రిలో వైద్యం.

క్యానపల్లి, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుషత్రి తరచు భాదధ్యతారహిత? వ్యవహార శైలికి అడ్డాగా మారనుందా? ఇక్కడ ఏం జరిగినా అధికారులు విచారణ చేయరు, పట్టించుకోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ మొదటి వారంలో సింగరేణి ఏరియా ఆసుషత్రి నుండి ఒక అంబులెన్స్, ఇద్దరు డ్రైవర్లతో కలిసి వాంకిడి చెక్ పోస్టు వరకు ప్రయాణించింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఓ అధికారి ఆదేశాల మేరకు ఓ అధికారి బంధువులు మహారాష్ట్రలో ఉండగా కోవిడ్ 19 కరోనా వ్యాధి సోకడంతో మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఏరియా అనుషత్రిని ఎంచుకున్నట్లు సమాచారం. అదే ఆచరణగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలోని అంబులెన్స్ వాంకిడీ చెకపోస్టు వద్దకు వెళ్లి కోవిడ్ సోకిన వ్యాధి గ్రస్తున్ని, ఇతరులను రామకృష్ణాపూర్ ఏరియా ఆసుషత్రికి తరలించి వైద్యం అందిస్తున్న తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాకపోకలకు సుమారు 180 కిలోమీటర్లకు గాను సింగరేణి ఏరియా ఆసుషత్రి డీజిల్, వాహనాన్ని ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావునిస్తుంది. 
మహారాష్ట్రలో కోవిడ్ ఏరియా ఆసుపత్రిలో వ్యాప్తి : 
దేశంలో కోవిడ్ ప్రభలడంలో ప్రథమ స్థానంలో ఉన్న మహరాష్ట్రలో ఉన్న కోవిడ్ 19 వైరస్ రెండో దఫా కూడా కోరలు చాచింది. దేశంలో కరోనా వైరస్ ప్రభలతుండగా అతి ప్రమాదకరమైన కరోనా వైరస్ మహా రాష్ట్ర లో ఉండడంతో అక్కడి ప్రభుత్వం అనేక చోట్ల నిబంధనలతో కూడిన సడలిం పులతొ పాటు పలు చోట్ల లాక్ డౌన్ ఆంక్షలు పెట్టినట్లు వార్త కథనాలు వెలువడాయి. సింగరేణి ఏరియా ఆసుషత్రి వైద్యలు వాహనాన్ని ఏర్పర్చి ఖర్చు వెచ్చించి తెలంగాణలో రాష్ట్రంలో కంటే వేగంగా ప్రభలే కరోనా ను అంబులేన్స్ ద్వారా రోగి రూపంలో వ్యాధిని తీసుకువచ్చి స్థానిక ప్రజలగు కరోనా వ్యాధి ప్రబలించే విధంగా వైద్యం అందించడంలో  డి వై సి ఎంహో ఉషారాణి పాత్ర కీలకంగా చెవ్పవచ్చు.
రోగితో పాటు.. ఇతరులకు సోకిన కరోనా ?
మహారాష్ట్రలో కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయడం వలన వ్యాధి తన భార్యకు సోకడంతో మహిళా వార్డులో చికిత్స అందిస్తున్న తీరు పట్టణంలో ప్రజలలో, కార్మిక కుటుంబాలలో భయాందోళన ఛాయలు అల్లుకున్నట్లు పలు కూ డక్లలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేసి భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారిని సంప్రదించగా మహారాష్ట్రలో కంటే తెలంగాణాలో కోవిడ్ 19 కరోనా వైరస్ సోకే విధానం తక్కువగా ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వ్యాధి అతి వేగంగా ప్రజలకు ప్రభలుతుందని అన్నారు. జిల్లాలో ప్రతి రోజు కోవిద్ 19 కేసులు పెరుగుతుండడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.