వామపక్షాల ఐక్యతతోనే దేశం రక్షించబడుతుంది** సిపిఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్

Published: Monday April 10, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 (ప్రజాపాలన,ప్రతినిధి) : వామపక్షాల ఐక్యతే దేశానికి రక్ష అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర మీటింగ్ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్కిస్ట్) సిపిఐ సిపిఎం పార్టీల రాష్ట్రస్థాయి సమావేశానికి ఆసిఫాబాద్ జిల్లా నుండి సిపిఎం కార్యదర్శి దుర్గం దినకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తుందన్నారు. మతోన్మాదాన్ని ప్రజల మధ్యలో వైశాల్యాలను పెంచుతుందని, దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను, అంబానీ, ఆధానీలకు, దోచిపెడుతుందన్నారు. కోట్ల మంది ప్రజలకు ఇచ్చే రాయితీలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఇచ్చే రాయితీలు చాలా తక్కువ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ఆదాని పేరు ఎవరికి తెలియదని,నేడు ఇన్ని ఆస్తులు ఇలా కూడపెట్టారో ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పాలన కూడా అంతంత మాత్రమేనని, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఎర్రజెండాల వల్లనే దేశం రక్షించబడుతుందని, రాష్ట్రంలో ఈరోజు సిపిఎం సిపిఐ ల ఉమ్మడి మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలీస్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజు, నారాయణులు, హాజరయ్యారని తెలిపారు.