ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు * కౌన్సిలర్ కుమ్మరపల్లి గోపాల్ ముదిరాజ్

Published: Monday January 02, 2023
వికారాబాద్ బ్యూరో 01 జనవరి ప్రజాపాలన : బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారని మద్గుల్ చిట్టంపల్లి కౌన్సిలర్ కుమ్మరపల్లి గోపాల్ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ సంవత్సరము ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. గత సంవత్సరంలో జరిగిన చేదు అనుభవాల గుణపాఠాలను మంచి అనుభవాలుగా మార్చుకోగల శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సర కాలంలో లభించాలని కోరారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ నిర్వాహకులు మధు అక్కయ్య వెంకటయ్య బందప్ప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.