ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించి,కనీస సౌకర్యాలు కల్పించాలి

Published: Tuesday July 06, 2021

మంచిర్యాల టౌన్, జూన్ 05, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రోజున భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యాలయ డిడి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్టంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మూతబడి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీ,పీజీ, డిప్లొమా పరీక్షలు జరుగే నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యల్లో భాగంగా లోకల్ అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విధులు నిర్వహించెటువంటి  కామాటి, కుక్, వాచ్మెన్ మరియు వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సంక్షేమ హాస్టల్ లో ఉండే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి. హాస్టళ్లు ప్రారంభదశలో విద్యార్థులకు ముందస్తు చర్యలో భాగంగా వ్యాక్సినేషన్  ప్రక్రియను మొదలు పెట్టే విధంగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో లక్ష్మి మనోహర్, రాజ్ కుమార్, శశి కుమార్, అన్వేష్ పాల్గొన్నారు.