అంబేద్కర్ కు ఘనంగా నివాళులు...

Published: Tuesday December 07, 2021
బీరుపూర్/ సారంగాపూర్, డిసెంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మరియు సారంగాపూర్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో డా:బీ.ఆర్. అంబెడ్కర్ 65 వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గల కోసం స్వేచ్ఛ గొంతుక అని సమత వాది డా:బాబా సాహెబ్ అంబెడ్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీరుపూర్ ఎంపీపీ మసర్తి రమేష్ ఎంపీడీఓలు మల్లారెడ్డి వాసల వెంకటేశం సారంగాపూర్ తహశీల్దార్ శ్రీలత ఎంపీవోలు రాజు శశికుమార్ రెడ్డి బదినపల్లి శంకర్ చేరుపూరి సుభాష్ కార్యదర్శి సతీష్ సూపరింటెండెంట్ రాజమౌళి సయిండ్ల మల్లేశ్ ఇందారపు నరేష్ సారంగాపూర్ ఎస్సైలు బండి లావణ్య నీనిషారెడ్డి దళిత సంఘాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.