కరోనా కు గురైన నిరుపేదలను ఆదుకున్న మారి స్వచ్ఛంద సంస్థ

Published: Monday May 24, 2021
బాలపూర్, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కు గురైనా నిరుపేదల కుటుంబాలకు మారి సంస్థ వారు డ్రై రేషన్ అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారి ఆదేశానుసారం కరోనా బారిన పడిన కుటుంబాన్ని ఆదుకోవడానికి  డ్రై రేషన్ కార్యక్రమాన్ని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చోవన్, బాలాపూర్ పి.హెచ్.సి శ్రీనివాస్ రెడ్డి, మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జయరాం, మీర్ పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి,  వైద్య శాఖ సి హెచ్ ఓ  బాలాపూర్ నర్సింగ్ రావు వాళ్ళ చేతిల మీద ఆదివారం నాడు అందజేశారు. ప్రాజెక్టు డైరెక్టర్  మాట్లాడుతూ.... భారత గ్రామ నవనిర్మాణ స్వచ్ఛంద సంస్థ తొమ్మిది పీహెచ్సీల్లో మా సిబ్బంది పనిచేస్తున్నామని అన్నారు. ఏ నిరుపేద కూడా పౌష్టిక ఆహారం లేక ఇబ్బంది పడకూడదని ఆలోచించి  బాలాపూర్ పీహెచ్సీలో, సరూర్ నగర్ పిహెచ్సిలో కూడా మారి స్వచ్ఛంద సంస్థ సేవలు అందించామని చెప్పారు. ఆదివారం నాడు బాలాపూర్ పిహెచ్సి పరిధిలోని 21 మందికి పాజిటివ్ నిరుపేద కుటుంబాలు వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు డ్రై రేషన్ అందజేయడం జరిగిందని చెప్పారు.
 ఈ కార్యక్రమంలో  మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ,శివాని రెడ్డి, మహేశ్వరి, సంధ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.