ప్రజా ప్రతినిధిని రీకాల్ చేసే హక్కు కల్పించాలి. ....తీన్మార్ మల్లన్న

Published: Tuesday December 20, 2022

 

బెల్లంపల్లి  డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: ఓటు ద్వారా ప్రజా ప్రతినిధులను ఏ విధంగా గెలిపించి ఎన్నుకుంటామో, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రజాప్రతినిదిని ఆ పదవి నుండి రీకాల్ చేసే అధికారాన్ని కూడా కల్పించాలని ఓటర్లను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా  యాత్ర చేపట్టినట్లు  "క్యూ న్యూస్"  ప్రతినిధి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు.
సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలను చైతన్యవంతం చేసే  యాత్రలో భాగంగా బెల్లంపల్లి కి వచ్చిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు,
తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కెసిఆర్ తన కుటుంబ సభ్యుల ఆస్తులు 2004లో 47 లక్షలు ఉండగా  ప్రస్తుతం నాలుగు లక్షల కోట్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు, 16 వేల కోట్ల మిగిల్ బడ్జెట్ తో తెలంగాణను అప్పగిస్తే, ప్రస్తుతం ఒక్కొక్కరి  తల మీద 1 లక్ష,50 వేల రూపాయల అప్పు భారాన్ని పెట్టాడని ఇది ప్రజలకు మేలు చేసినట్లా,  కీడు చేసినట్లా అని అన్నారు.
ధరణి పేరుతో అనుభవదారు కాలం తీసేస్తే మూడు లక్షల ఎకరాల భూమిని వదిలిపెట్టి పోయిన దొరలు మళ్ళీ వారి చేతుల్లోకి తీసుకున్నారని,  తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ వంద సంవత్సరాల వెనక్కి తీసుకుపోయారని  అన్నారు.
 32 లక్షల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1 లక్ష,32 కోట్లతో పూర్తి చేశారని, లక్ష కోట్ల రూపాయలు ఎటుపోయినాయని అన్నారు, నిజంగా కాలేశ్వరం ప్రాజెక్టుతో పంట పొలాలకు నీరు అందిస్తే, కరెంటు మోటార్లకు ఇంకా కరెంటు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్, సంస్థల నుండి అప్పులు తీసుకొని చెల్లించకుండా ఆ సంస్థల ను నిర్వీర్యం చేస్తున్నాడని, ఆంధ్రాలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలో నడపాలని, సింగరేణి కార్మికులకు రైతులకు మాదిరిగానే వృత్తి పన్ను ఐటి నుండి మినహాయింపు ఇవ్వాలని, వివిధ సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉచితాల పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్నారని, కెసిఆర్ చేపట్టే ప్రతి పథకం నిధులు లేక నిరసించి ఆగిపోతున్నాయని, రానున్న ఎన్నికల అనంతరం రైతుబంధు కూడా ఇవ్వడని ఆయన జోష్యం చెప్పారు.
7200 సంఖ్యకు అర్థం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా రాష్ట్రంలో 7200 మంది అవినీతిపరులుగా, ప్రజా వ్యతిరేక ప్రజా ప్రతినిధులు ఉన్నారని, ఆ సంఖ్యను జీరోకి తీసుకురావడానికి తను ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  సంస్థ ప్రతినిధి దాసరి భూమయ్య, మార్నింగ్ న్యూస్ పత్రికల విశ్లేషకుడు సుదర్శన్, పలువురు డప్పు కళాకారులు, తదితరులు, పాల్గొన్నారు.బెల్లంపల్లి  డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: ఓటు ద్వారా ప్రజా ప్రతినిధులను ఏ విధంగా గెలిపించి ఎన్నుకుంటామో, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రజాప్రతినిదిని ఆ పదవి నుండి రీకాల్ చేసే అధికారాన్ని కూడా కల్పించాలని ఓటర్లను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా  యాత్ర చేపట్టినట్లు  "క్యూ న్యూస్"  ప్రతినిధి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు.