కాకరవాయి హై స్కూల్ ఇంచార్జి హెచ్ఎం శ్రీనివాసులు తక్షణమే సస్పెండ్ చేయాలి..

Published: Thursday February 17, 2022
పాలేరు పిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : తిరుమలాయపాలెం హై స్కూల్ ఎదుట ధర్నా చేయడం జరిగింది. విద్యార్థుల పై చెయ్యి చేసుకున్న కాకరవాయి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ సస్పెండ్ చేయాలని తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ ఎదుట ధర్నా చేయడం జరిగింది. పి.డి.యస్.యూ పాలేరు డివిజన్ కమిటీ పాఠాలు అర్థమయ్యే విధంగా చెప్పామని అడిగిన మహిళ విద్యార్థులను కోటిన కాకరవాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ఉపాధ్యాయులు శ్రీనివాసును పై తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ కాకరవాయి ఇన్చార్జి ప్రధానపాధ్యాయులు శ్రీనివాసరావుపై ఇంతవరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చోటు తక్షణమే ఇంచార్జి ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ని సస్పెండ్ చేయాలని  ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఎంఈఓ శ్రీనివాస్ సార్ డి ఓ గారి దృష్టికి తీసుకెళ్లిన కూడా ఇంతవరకు పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని కోరుతున్నాము ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేసే ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు వెళ్ళకుండా వారి వ్యక్తిగత పనులు చేసుకునే పరిస్థితి కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాలు నేర్పాల్సిన చేతులే నీ పాటలు బోధించమని అడిగితే సమయానికి పాఠశాలకు రాకుండా క్లాసులు చెప్పకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఉపాధ్యాయు లు నేడు ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నారని దానికి నిదర్శనమే కాకర హై స్కూల్ ఇన్చార్జి హెచ్ ఎం శ్రీనివాసులు అని ఇలా ఎంతోమంది రాజకీయ అధికారం తోటి విద్యాసంస్థలలో నాశనం చేసిన దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తోందని తక్షణమే ఇలాంటి ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. పిడిఎస్యు నాయకులు నరేష్ తిరుమల్ రాజేష్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు గోపనపల్లి మస్తాన్, జిల్లా నాయకులు లక్ష్మణ్, వినయ్, సతీష్, పృద్వి, కరుణ్, శ్రీకాంత్ రవి, రాకేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.