ముంపునకు గురవుతున్నటువంటి ప్రాంత వివరాలు, కరకట్ట నిర్మాణం గురించి ఐ టి సి పి ఎస్ పి డి యూనిట్

Published: Wednesday September 28, 2022
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిసిన... ఐటీసీ యూనిట్ హెడ్ శ్రీ సిద్ధార్థ మహంతి .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన.
  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ను మంగళవారం నాడు ఐటిసి యూనిట్ హెడ్  మహంతి  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వీరితోపాటు డీజీఎం శ్రీ శ్యామ్ కిరణ్ , ఐటీసీ చీఫ్ మేనేజర్ శ్రీ చెంగల్ రావు , పినపాక శాసనసభ్యులు కాంతారావుతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం, బూర్గంపహాడ్ మండలంలో ఇటివల వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం  నిర్మించ తలపెట్టిన కరకట్ట కు సంబంధించి నీటిపారుదల శాఖ,నిపుణులు రూపొందించిన మ్యాప్ ను ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఐటీసీ అధికారులకు వివరంగా చెప్పడం జరిగినది. సుమారుగా 100 అడుగులు ఎత్తుతోనే 120 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్టు రేగ కాంతారావు ఐటీసీ వారికి వివరించడం జరిగినది.