కార్మిక చట్టలను కలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు

Published: Thursday December 02, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 1 ప్రజాపాలన ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ 22-25 జనవరి న జరిగే తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల సందర్బంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాంపేట్ లో మాస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ch. ఎల్లేశ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కళరస్తున్న పరిస్థితి ఉందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హమలు చేయని పరిస్థితి ఉందన్నారు. 44 చట్టలను 4 కోడ్ లుగా చేసి కార్మికులు హక్కులను కలరాస్తున్న కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి, రాష్ట్రంలో వున్నా తెరాస ప్రభుత్వాలు గద్దెదించాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్క యంజాల్ లో జనవరి 22-25 జరిగే తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యమంలో జిల్లా సెక్రటరీ సభ్యులు బి.సామెల్, సిపిఎం మండల కార్యదర్శి. చేతాల్ల జంగయ్య, శంకర్, ముసిలయ్య గణేష్, జగన్, యాదగిరి, బుగ్గరాములు, షేప్పివున్నిసా, స్వప్న, భిక్షపతి, యాదయ్య, యాదయ్య, సాయఫ్, లింగం స్వామి తదితరులు పాల్గొన్నారు.