ఉపకార వేతనాల గడువు పెంపు

Published: Thursday November 03, 2022
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి సుధారాణి
వికారాబాద్ బ్యూరో 02 నవంబర్ ప్రజా పాలన : కేంద్ర ప్రభుత్వం ప్రీ పోస్ట్ మెట్రిక్ మెరిట్ కం మీల్స్ ఉపకార వేతనాలు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ గడువు పెంచడం జరిగిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుచున్న ఈ పథకంలో 2022-23 విద్యా సంవత్సరము నకు మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా కోరబడుచున్నవన్నారు.
ప్రీ మెట్రిక్ బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్ షిప్ కొరకు విద్యార్ధులు  ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్,15 గా పెంచడం జరిగిందని అన్నారు. స్కూల్(ఐఎన్ఓ) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ నవంబర్,30 డిఎండబ్ల్యూఓ (డిఎన్ఓ) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ డిసెంబర్, 15 వరకు చేయడం జరుగుతుందన్నారు. పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీల్స్ మెట్రిక్ కొరకు విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్,30 అని, కాలేజ్(ఐఎన్ఓ) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ డిసెంబర్,15
డిఎండబ్ల్యూఓ(డిఎన్ఓ) లెవల్ వెరిఫికేషన్ కొరకు చివరి తేదీ డిసెంబర్,31 అని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు (ప్రభుత్వ ఆమోదిత) విద్యా సంస్థల నిర్వాహకులు, స్కాలర్ షిప్ దరఖాస్తు చివరి తేది వరకు పొడిగింపు విషయంలో మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు సరైన అవగాహన కల్పించి, అర్హులైన మైనారిటీ విద్యార్థిని విద్యార్థులందరూ (కేంద్ర ప్రభుత్వ) ప్రీ మెట్రిక్/బేగం హజరత్ మహల్/పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీల్స్ స్కాలర్ షిప్ దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సహకరించుటకు కోరనైనది. తదుపరి విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆన్ లైన్ దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి (స్టూడెంట్ ఆధార్ కార్డు/ఫోటో/స్టడీ,బోనఫైడ్/ప్రోగ్రెస్ కార్డు/ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు) పూర్తి సర్టిఫికెట్స్ తో జతపరిచిన అర్హత గల దరఖాస్తులను తమకు కేటాయించిన లాగిన్ ద్వారా దరఖాస్తులు షెడ్యూల్డ్  చివరి తేదీ లోగా పరిశీలించి ఆన్ లైన్ ద్వారా జిల్లా నోడల్ ఆఫీసర్ గారికి వెరిఫై చేసి ఫార్వర్డ్ చేయాలన్నారు. షెడ్యూల్డ్ చివరి తేదీ లోగా పరిశీలించిన దరఖాస్తులకు పూర్తి బాధ్యత ఆ యొక్క పాఠశాల/కళాశాల యాజమాన్యం వారిదే అన్నారు.