నర్సరీని పరిశీలించిన ఏం.డి.ఓ

Published: Wednesday December 15, 2021
బోనకల్, డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి:బోనకల్ మండల పరిధిలో లక్ష్మిపురం గ్రామంలో నర్సరిని పరిశీలించిన ఎండిఓ గొట్టేపాటి శ్రీదేవి నర్సరిలో బ్యాగ్ ఫిల్లింగ్ పరిశీలించి, పంచాయతీ రికార్డులు తనిఖీ చేసారు. ఉపాధి హామీ కూలీలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నన్నక లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బానోత్ శివ, గ్రామ పెద్దలు కిలారు తిరుపతయ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.