వచ్చే ఎలక్షన్లో బండి సంజయ్ కు గండి తప్పదు .. -బీజేపీ బ్యాండ్ బజాన పుల్ -నియోజకవర్గ ప్రజలకు సేవ

Published: Saturday July 09, 2022
-ఎంపీ పదవికి బండి రాజీనామా చేయాలి..?
-ఏఐఎస్ బీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి  మండి పాటు
 
కరీంనగర్  8 ప్రజాపాలన ప్రతినిధి : 
బండి సంజయ్ పై   ఎంతో నమ్మకం , విశ్వాసం తో కరీంనగర్ ఎంపీ గా గెలిపిస్తే  ఓటర్ల  నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేసి బీజేపీ పార్టీకి భజన  డప్పు కొడుతూ పైశాసిక ఆనందం పొందుతున్నడని,  కరీంనగర్  పార్లమెంట్ అభివృద్ధికి  ఏ మాత్రం కృషి చేయని బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే  ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ లోని ఏఐఎస్ బి ఉత్తర తెలంగాణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి  సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశాడో  ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.   ఎంపీ గా గెలిసి మూడున్నర ఏళ్ళైనా మూడు లక్షల అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు.   కరీంనగర్ పార్లమెంట్  నియోజకవర్గంలో ఏఏ గ్రామంలో ఎం చేసావు.? ఎం మండలంలో ఎం చేసినవు..?  ప్రజలకు చెప్పే  దమ్మూ ఉందా .?.. అని ప్రశ్నించారు.  ఎక్కడ కూడా ఏమీ చేయలేదని, అంతా ఉనక దంపుడు మాటలు తప్ప మరొకటి లేదన్నారు.  తరుచూ పార్టీ సేవలు తప్ప, ప్రజల సేవలు లేవని నిలదీశారు.  ఇటీవల హైదరాబాద్ లో జరిగిన  బీజేపీ సమావేశాలకు జనాన్ని తరలించేందుకు  రెండు ప్రత్యేక రైళ్ళను వేయించిన బండి సంజయ్ కరీంనగర్ రైల్వే లైన్ అభివృద్ధి కి ఎందుకు చేయడం లేదన్నారు. చొప్పదండి మార్గంలో కరీంనగర్ వద్ద రైల్వే లైన్  మీద బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు కృషి చేయడం లేదన్నారు. పార్టీ సేవల మీద ఉన్న యావ పార్లమెంట్ ప్రజల మీద ఎందు లేదని ప్రశ్నించారు. కరీంనగర్ నుండి చొప్పదండి వచ్చి పోయే వాహన చోదకులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతుంటే .. పట్టించుకోవడం లేదన్నారు.  కరీంనగర్ గతంలో ఉన్న రైళ్ల ను రద్దు చేరిన ఘనత బండి సంజయ్ కే దక్కుతుందని అన్నారు. కరీంనగర్ నుండి నిత్యం తిరుపతి కి  ట్రైన్ నడిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ నీవు  పార్లమెంట్ ఓటర్లలకు, ప్రజలకు సేవలు చేయనోడివి. నియోజకవర్గ అభివృద్ధి ని పట్టించుకోలేనోడివి నీకు సిగ్గుంటే  వెంటనే కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  కరీంనగర్ స్మార్ట్ సిటీ లో వెయ్యి కోట్ల అభివృద్ధి పనుల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో  (మంత్రి, మేయర్) కుమ్ముకై 250 కోట్ల మేరకు పర్సెంటీల పేరిట చేతులు మార్చుకుంటూ జేబులు  నింపుకుంటున్న వైనం ప్రజలు చూస్తున్నారని తస్మాత్ జాగ్రత అని అంబటి జోజిరెడ్డి  హెచ్చరించారు.  తెల్లారితే టిఆర్ఎస్, బిజేపీ పార్టీలు రెండూ  కూడా ఆయా పార్టీల పబ్లిసిటీకి ఒక్క మీటింగ్ కు 500 నుండి వెయ్యి కోట్ల చొప్పున ప్రజాధనాన్ని నీళ్ళలా దుర్వినియోగం చేస్తున్నాయని మండి పడ్డారు. 
కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేని బండి సంజయ్ బేషరతుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విమర్శించారు.   ఎంపీ గా కరీంనగర్ అభివృద్ధికి ఎం చేశావో ప్రజలకు నిరూపిస్తూ శ్వేత పత్రం విడుదల చేయాలని ఇటీవల కేటీఆర్   ఒక సభలో బహిరంగ సవాల్ విసిరితే, ప్రజలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ సిగ్గు లేకుండా చేతులు పిసుక్కుంటున్నాడని విమర్శించారు. దమ్ముంటే ఎంపీ బండి సంజయ్ తాను ఏమీ అభివృద్ధి పనులు తెచ్చావో, ఎన్ని  నిధులు తెచ్చావో శ్వేత పత్రం విడుదల చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని అంబటి జోజిరెడ్డి సవాల్ విసిరారు.   బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు పంగ నామాలు పెట్టి, బిజెపి రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో కొలువుధీరాడని విమర్శలు చేశారు.  బండి సంజయ్ పై కరీంనగర్ ప్రజలు, ఓటర్లు  ఎంతో కోపంగా, ఆగ్రహంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వనున్నారని అన్నారు.  బండి సంజయ్ నువ్వు ఇప్పటికయినా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పార్టీ సేవలు చేస్తే  ఎంపీ పదవికి  రాజీనామా చేయాలని, లేదా పదవికి సేవ చేయాలంటే బీజేపీ  అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.   అలా కాకుండా దేనికీ రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా రెండూ పదవులు కాపాడుకుంటూ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని పేర్కొన్నారు.  ఎన్నికలకు ముందు ఒక సామాన్యుడు గా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు సంపాదనంలో కేసీఆర్ ను మించిపోయాడని, వందలు, వేల కోట్లకు పడగలెత్తాడని విమర్శించారు.   ఢిల్లీ, హైదరాబాద్ రాజకీయాలకే పరిమితమైన బండి సంజయ్ ఒక్క సారి ప్రజల్లోకి వస్తే ప్రజలు తరిమికొడుతారని అంబటి జోజిరెడ్డి విమర్శించారు.