ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *ప్రభుత్వ భూమిని రక్షించాలి.. తాసిల్దార్

Published: Friday November 11, 2022

బాలాపూర్ మండలం కుర్మల్ గూడ లోని సర్వే నంనర్ 88/2 ,88/3 లో గల ప్రభుత్వం భూమిని కాపాడలని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అద్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటి అధ్యక్షుడు   గోరా శ్యాంసుందర్ గౌడ్  డిప్యూటి తహశిల్దర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కంచే చేను మేసిన విదంగా కొందరు వక్రబుద్దితో అక్రమ సంపాదనకోసం కక్కుర్తి పడి ప్రభుత్వం భూములను కబ్జా చేస్తున్నరు.
ప్రభుత్వం భూములను కాపడవలసిన ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు.
కబ్జాదరులను ఉసిగొల్పి ప్రభుత్వం భూమి సర్వే నంబరు మార్చి ప్రవేటు సర్వే నెంబరు వేసి అట్టి‌బూమిని ప్లాట్లుగ మార్చి కోట్లలో సంపాదిస్తున్నారని  అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని బొంగు వెంకటేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులతో   చేతులు కలిపి  కబ్జాకు గురి చేస్తున్బారని మండల అధికారి ద్రుష్టకి‌ తీసుకెళ్లడం జరిగింది. కావు‌న ఆ భూమి చుట్టు పెన్షింగ్ వేసి అందులో ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేసి అట్టి భూమిని కబ్జా చెరదారుల నుండి  కపాడవలసినదిగా  విజ్నప్తి చేస్తున్బాము.