మండల వ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లను వెంటనే పునర్నిర్మాణం చేయాలి : ఫైళ్ల ఆశయ్య

Published: Tuesday October 26, 2021
యాదాద్రి అక్టోబర్ 25 వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వర్షాలతో ధ్వంసమైన బిటి రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో నల్గొండ - భువనగిరి రహదారిని దిగ్బంధం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య హెచ్చరించారు. సోమవారం సిపిఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా  తహసిల్దార్ కార్యాలయం ముట్టడిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నెలకొన్న అనేక  స్థానిక ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఎన్నికల మీద ఉన్న సోయి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు లేకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వలిగొండ మండల పరిధిలోని సుమారు పది గ్రామాలకు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి లింకు రోడ్లుగా ఉన్న వాటికి బిటి రోడ్డు సౌకర్యం లేదన్నారు.69 వేల జనాభా ఉన్న ఈ మండలంలో రైతాంగానికి తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని, పాలకుల నిర్లక్ష్యం మూలంగా రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడైపోతే ఒకవైపు రామన్నపేట కు మరొకవైపు భువనగిరి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలానికి 11 గ్రామాలకు సాగునీరు అందించే బునాదిగాని 2004లో ప్రారంభమైన కాలువ పనులు నేటికీ పూర్తి చేయలేకపోయారని, రైతాంగం పట్ల కనీసం చిత్తశుద్ధి లేని ప్రజా ప్రతినిధులు అధికారంలో కొనసాగుతున్నారని, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేక పోయారని విమర్శించారు. మండల కేంద్రంలో సర్వే నెంబర్ 29 ఇండ్లస్థలాల లబ్ధిదారుల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని,ఇండ్లు లేని పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలన్నారు.మండల కేంద్రంలో యస్ సి,బిసి వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని,మండలంలోని మంజూరై 1200 పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్స్ తో కూడిన తహశీల్దార్ నాగలక్ష్మి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, కల్కురి రామచందర్, మండల కమిటి సభ్యులు మొగిలిపాక గోపాల్, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకట్ రెడ్డి, కొండే కిష్టయ్య, దుబ్బ లింగం, బీమనబోయిన జంగయ్య, కవిడే సురేష్, పట్టణ కార్యదర్శి గర్దసు నర్సింహా, నాయకులు బొడ్డుపల్లి భిక్షపతి, ఏనుగుల నర్సింహా, కొంతం తిర్మల్ రెడ్డి, దొడ్డి భిక్షపతి, వడ్డేమని మధు, వేముల నాగరాజు, పలుసం లింగం, ఎడవేల్లి నర్సింహా, పోలేపాక గణేష్, వేముల లక్ష్మయ్య, ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఈర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.