ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జరజాగ్రత్త

Published: Monday July 11, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ  వ‌ర్షాలవ‌ల్ల ప్ర‌జానీకానికి ఇబ్బంది త‌లెత్త‌కుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఇబ్రహీంపట్నం మండల  ఉప్పరిగూడా సర్పంచ్ బూడిద రాంరెడ్డి అన్నారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ
రెవెన్యూ, మున్సిపల్, పోలీసుశాఖ‌లు ఎప్ప‌టిక‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను చేప‌ట్టాల‌ని అన్నారు.  చెరువులు, ఇత‌ర నీటినరుల వద్ద ఎలాంటి ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకో వాల‌ని,విద్యుత్ పట్ల ప్రజానీకం అప్రమత్తత చాలా అవసరమని, సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి  సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆదివారం ఇబ్రహీంపట్నం లో 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని రానున్న 3రోజులు ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని, పాత ఇండ్లలో బసచేయకుండా సురక్షిత ప్రాంతంలో ఉండాలని పేర్కొన్నారు.