జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు -డాక్టర్ ప్రియాంక తాల్క

Published: Saturday July 02, 2022
హైదరాబాద్ 01 జూలై ప్రజాపాలన: 
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా  డాక్టర్ ప్రియాంక తాల్క వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
జనగాం జిల్లా పాలకుర్తి కమ్యూనిటీ  హెల్త్ సెంటర్  డాక్టర్ ప్రియాంక తాల్క  జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా  ప్రజాపాలన తో మాట్లాడుతూ...
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గౌరవార్థం 01 జూలై 1991న తొలిసారిగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఆరోగ్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఘనంగా నివాళులు అర్పించేందుకు  జూలై 01 అతని వర్ధంతి మరియు పుట్టిన రోజు  కలిసి వస్తుందన్నారు.
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (01 జూలై 1882 - 01 జూలై 1962) ప్రఖ్యాత వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్  పశ్చిమ బెంగాల్‌ కు 1948 - 1962 వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా  కూడా పనిచేశాడు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ ను 04 ఫిబ్రవరి 1961న అత్యున్నత భారతీయ పౌర పురస్కారం, భారతరత్న తో సత్కరించారు.
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోశాడన్నారు. అనేక మందికి చికిత్స చేశాడు మరియు మిలియన్ల కొద్ది ప్రజలకు  స్ఫూర్తి ప్రదాత. ఇతను మహాత్మా గాంధీ వ్యక్తిగత వైద్యుడు అని కూడా చెప్పవచ్చు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆయుష్షు ను మెరుగు పరచుకోవడానికి అంకితభావంతో పని చేసే వారిని మనం డాక్టర్లు అని పిలుస్తాము. మనం పూర్వికులు
"వైద్యో నారాయణో హరి" అని సంబోంధించారు. అంటే అంతటి స్థానాన్ని వైద్య వృత్తికి ఉంది. అంతటి గౌరవాన్ని నిలుపు కోవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. 
 
మానవ ఆరోగ్యం పట్ల వారి సహాయ సహకారం అంచనాలకు మించిన దన్నారు.
 
 
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 01న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహమ్మారి పరిస్థితి ఉన్నప్పుడు, సామాన్య ప్రజల  కోసం వైద్యులు ఎల్లప్పుడూ దానితో పోరాడటానికి ముందు వస్తారు. ప్రపంచాన్ని గడ గడ  లాడించిన  మహమ్మారి కోవిడ్-19 లో వైద్యుల సేవలను వారి కష్టాలను అందరు చూసిందే అనుభవించిందే.  గతంలో  ప్లేగు, ఫ్లూ, ఎయిడ్స్, ఎబోలా మొదలైన అనేక మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొని వైద్యులు  ప్రజలకు సేవలు అందించారు.ఇక్కడ వైద్యులు ప్రజల భద్రత మరియు వారి ఆరోగ్యం కోసం సైనికుల వలె ముందు వరుసలో ఎల్లప్పుడూ  ఉంటారు. 
 
1976 లో బి.సి. వైద్యం, సైన్స్, ప్రజా వ్యవహారాలు, తత్వశాస్త్రం, కళలు మరియు సాహిత్యం వంటి రంగాలలో పనిచేస్తున్న ప్రముఖ వ్యక్తిని గుర్తించడానికి రాయ్ జాతీయ అవార్డు అతని జ్ఞాపకార్థం స్థాపించబడినదని గుర్తు చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రియాంక తాల్క అందరికీ మరి ఒక సారి  శుభాకాంక్షలు తెలియజేశారు.