బడి తండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం అన్నదాన్ని కార్యక్రమాన్ని ప్రారంభి

Published: Thursday October 06, 2022
బోనకల్, అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల బడి తండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోగ్రామ సోమవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి బోనకల్ ఎస్సై కవిత ముఖ్యఅతిథిగా హాజరై దుర్గాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ శ్రీ కనకదుర్గా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కవిత మాట్లాడుతూ శ్రీ కనకదుర్గా దేవి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ఆ తల్లి కృపా కటాక్షాలతో అందరూ సుఖ సతోషాలతో వర్ధిల్లాలని, సిరి సంపదలతో దుర్గాదేవి చల్లని దీవెనలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ,ఎంపీటీసీ కందిమల్ల రాధ,టీఎస్ యుటిఎఫ్ మండల కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, ఐద్వా నాయకురాలు గుగులోతు శారద, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు, గ్రామ పెద్దలు షేక్ జానీ, బానోతు కృష్ణ, బానోతు నాగేశ్వరరావు, బానోతు రమేష్ , బానోత్ సురేష్, బానోత్ శ్రీను, గుగులోతు రాములు, గుగులోతు నరేష్, తండ మహిళలు, చిన్నలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.