సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేసిన సర్పంచ్

Published: Wednesday February 22, 2023

జన్నారం, ఫిబ్రవరి 21  ప్రజాపాలన:  ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ ఆదేశాల మేరకు మండలంలోని తీమ్యపూర్ గ్రామపంచాయతీ చెందిన  రేగుంట సుదర్శన్ కు 56, 000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందచేయడం జరిగిందిని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన చెక్కును  బదితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సీఎం రిలీజ్ వండు రాష్ట్రంలోని ప్రజలకు వరం లాంటిదన్నారు.  పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను దేశంలో ఉన్న ప్రజలకు చెందాలంటే బిఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, వెంకట్, చంద్రయ్య, బాధితులు, ఇతరులు పాల్గొన్నారు.